విపశ్యన
శ్రీ గోయెంక గారిచే భోదించబడిన
ధ్యానం
సాయజి ఉ బ ఖిన్ గారి సంప్రదాయంలో
స్వాగతం
విపశ్యన అంటే విషయాలను ఉన్నవి ఉనట్టుగా చూడటం. ఇది భారత దేశం యొక్క ఒక అతి పురానా ధ్యాన పద్ధతి. ఇది భారత దేశంలో 2600 సం|| ల క్రితం, సార్వత్రిక రుగ్మతల కోసం, సార్వత్రిక పరిహారంగా బోధించబడినది. అంటే ఒక జీవన కళ. విపశ్యన ధ్యానం గురించి తెలియని వారికి, శ్రీ గోయెంక గారు ఇచ్చిన పరిచయం & విపశ్యన గురించి ఇతర వీడియొలు మరియు ప్రశ్నలు & జవాబులు అందుబాటులో ఉన్నాయి.
శిబిరంలు
విపశ్యన ధ్యాన పద్దతి పది రోజుల శిబిరంలో బోధించబడుతుంది. ఈ శిబిరాలలో పాల్గొనే వాళ్ళు, ఈ పద్ధతి గురించి ప్రాథమిక విషయాలు నేర్చుకొని దీని ప్రయోజనకరమైన ఫలితాలు అనుభవించడానికి తగినంత సాధన చేస్తారు. ఈ శిబిరాలలో పాల్గొనడానికి రుసుము ఏమి చెల్లించనవసరం లేదు - భోజనం, వసతికి కూడా. అన్ని శిబిరాలు ఇంతకు ముందు విపశ్యన శిబిరంలో పాల్గొని, దాని వల్ల ప్రయోజనం పొంది, ఇతరులు కూడా అటువంటి ప్రయోజనం పొందాలని అనుకొనే వారు ఇచ్చే విరాళాల ద్వార నడుపబడుతున్నవి.
ప్రదేశములు
శిబిరాలు అనేక ధ్యాన కేంద్రాలలో ఇంకా అద్దెకు తీసుకున్న కేంద్రం కాని ప్రదేశాలలో కూడా నడపబడుతున్నవి. ప్రతి ప్రాంతానికి దాని స్వంత శిబిర కాల పట్టిక ఉంది. చాల శిబిరాలలో ప్రవేశం కొరకు దరఖాస్తు పత్రాన్ని ఈ వెబ్ సైట్లో, ఆన్లైన్లో పూర్తి చేయ వచ్చు. భారత దేశం మరియు ఆసియా/ పసిఫిక్ ప్రాంతాలలో అనేక కేంద్రాలు ఉన్నాయి; ఉత్తర అమెరికాలో 10 కేంద్రాలు; లాటిన్ అమెరికాలో 3 కేంద్రాలు; యూరోప్‌లో 8 కేంద్రాలు; ఆస్ట్రేలియా/ న్యూజీలాండ్‌లో 7 కేంద్రాలు; మధ్య ప్రాచ్యంలో 1 మరియు ఆఫ్రికాలో 1 కేంద్రం ఉన్నాయి. కేంద్రం కాని ప్రాంతాలలో తరచుగా పది రోజుల శిబిరాలు, ఆ ప్రాంతాలలో ఉన్న విపశ్యన సాధకుల చే ఏర్పాటు చేయబడుతున్నవి. ప్రపంచ వ్యాప్తంగా భారత దేశం మరియు నేపాల్‌లో శిబిర ప్రాంతాల జాబితా అక్షర క్రమంలో మరియు చిత్ర రూపం లో అందుబాటులో ఉన్నాయి.
ప్రత్యేక శిబిరాలు మరియు వనరులు
విపశ్యన శిబిరాలు చెరసాలల్లో కూడా భోదింప పడుతున్నవి. ప్రత్యేకంగా వ్యాపారవేత్తలకు మరియు ప్రభుత్వ అధికారులకు ప్రత్యేక 10 రోజుల శిబిరాలు అనేక కేంద్రాలలో నిర్ణిత సమయాలలో నిర్వహింపబడుతున్నవి. అదనపు సమాచారం కోసం ఎగ్జిక్యూటివ్ కోర్సు వెబ్సైట్ సందర్శించండి. విపశ్యన ధ్యానం గురించి సమాచారం ఇతర భాషలలో కూడా అందుబాటులో ఉంది. వేరే భాషను ఎంచుకోవడానికి పైన కుడివైపున ఉన్న భూగోళం పటం పైన క్లిక్ చేయండి.